కేసీఆర్ టోన్‌లో వచ్చిన మార్పేంటి? పెద్ద నోట్ల రద్దుపై కేసీఆర్ పాజిటివ్‌గా మాట్లాడారే?

మంగళవారం, 20 డిశెంబరు 2016 (09:43 IST)
పెద్ద నోట్లు రద్దైన వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు వ్యతిరేకంగా స్పందించారు. పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర ఆదాయాలతో తీవ్ర ప్రభావం చూపుతుందని.. వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని తొలిసారి సీఎం కేసీఆర్ గళమెత్తారు. ఆ తర్వాత కొన్నిరోజులు వరుసగా నోట్ల రద్దు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. అయితే కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా కేసీఆర్ టోన్‍లో మార్పు వచ్చింది. 
 
నవంబర్ 8 రాత్రి మోడీ పెద్దనోట్ల ప్రకటన చేయగానే దేశమంతా షాక్ తింది. అప్పట్లో కేసీఆర్ మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ ఢిల్లీకి వెళ్లి మోడీని కలిశాక.. పెద్ద నోట్ల రద్దుపై పూర్తి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలోనూ మోడీకి పూర్తిగా వెనకేసుకొచ్చారు. ఈ మార్పుకు కారణమేంటన్నది విశ్లేషకులకు అంతుబట్టకుండా ఉంది. అయితే ఢిల్లీలలో కేసీఆర్ ఫ్యామిలీకి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడమే ఈ మార్పుకు కారణమని కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. 
 
కానీ తెలంగాణకు సంబంధించిన కొన్ని కీలకమైన ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ మోడీ దగ్గర స్పష్టమైన హామీ తీసుకున్నారని.. అందుకే మోడీని సపోర్ట్ చేస్తూ గొంతు వినిపిస్తున్నారని తెరాస వర్గాలు తెరాస వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ ఏం చేసినా అందులో రాష్ట్ర ప్రయోజనాలు ఇమిడి ఉంటాయని చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి