కొత్త శ్రీనివాస్ 2022 క్యాలెండరును ఆవిష్కరించిన కేటీఆర్

శనివారం, 29 జనవరి 2022 (11:20 IST)
కవి కొత్త శ్రీనివాస్ రూపొందించిన‌ 2022 క్యాలెండరును ఆవిష్క‌రించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. 
 
ఈ సంద‌ర్భంగా క్యాలెండర్ రూపకర్త, రచయిత కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ "మహాకవి శ్రీశ్రీ అన్నట్లు మానవ జీవితమే ఒక మహాభారతం - అది మంచి చెడుల రెంటి నడుమ నిత్యఘర్షణం" అని, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్పే మాటలకు ప్రభావితమైన అర్జునుడు ఉత్సాహంగా యుద్ధంలో గెలిచాడాని, అదేవిధంగా, శల్యుడు అన్న మాటలకు ప్రభావితమైన కర్ణుడు నిరుత్సాహానికి లోనై యుద్ధంలో ఓడిపోయాడని పేర్కొన్నారు. 
 
ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు