తెలంగాణ సర్కారు రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయాని పెద్దపీట వేసింది. వార్షిక బడ్జెట్ 2018-19లో భాగంగా తొలుత వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపుల గురించే ప్రస్తావించారు. ఇందులో ప్రముఖంగా పెట్టుబడి పథకం గురించి ప్రస్తావించారు. ఈ పథకం కోసం ఏడాదికి రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.8 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
అలాగే భూ రికార్డుల ప్రక్షాళన కోసం ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈటెల తెలిపారు. ఇంకా బిందు, తుంపర సేద్యానికి రూ.127 కోట్లు కేటాయించారు.
మహిళాశిశు సంక్షేమానికి రూ.1799 కోట్లు
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ.9693 కోట్లు
ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.12709 కోట్లు
దళితులకు భూ పంపిణీ కింద రూ,1469 కోట్లు
ఎస్టీల అభివృద్ధి శాఖకు 8063 కోట్లు
రోడ్లు, రవాణా, భవనాల కోసం రూ.5,575 కోట్లు
విద్యుత్ కోసం రూ.5,650కోట్లు
చేనేత, టెక్స్‌టైల్ రంగానికి రూ.1200 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూ.1286 కోట్లు
వరంగల్ నగర అభివృద్ధికి రూ.300 కోట్లు
పట్టణాభివృద్ధి శాఖ రూ.7251 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈటెల ప్రకటించారు.