తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19: రాష్ట్ర జీడీపీ ప్రతీ ఏడాది పెరుగుతుంది.. ఈటెల
గురువారం, 15 మార్చి 2018 (11:23 IST)
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా వుందని ఈటెల ప్రకటించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19 పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఇది ఎన్నికల బడ్జెట్ కాదని.. ప్రజాబడ్జెట్ అంటూ ఈటెల ప్రకటించారు.
బడ్జెట్ కీలకాంశాలను ఓసారి పరిశీలిస్తే..
మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు
స్థూల ఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించాం
సీఎం కేసీఆర్ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టారు
రాష్ట్ర జీడీపీ ప్రతీ ఏడాది పెరుగుతుంది
స్థూల ఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించాం
రెవన్యూ వ్యయం రూ.1,25,454 కోట్లుగా కేటాయించాం.
రాష్ట్ర ఆదాయం రూ. 73,751 కోట్లు
కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు
ద్రవ్య లోటు అంచనా రూ.29,077 కోట్లు
పంట పెట్టుబడి పథకం రూ.12వేల కోట్లు
రైతు బీమా పథకం రూ.500 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ రూ.552 కోట్లు
బిందు సేద్యం రూ. 127 కోట్లు
పాలీహౌస్, గ్రీన్ హౌస్ రూ.120 కోట్లు
వ్యవసాయం, మార్కెటింగ్ రూ.15,780 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులు రూ.25వేల కోట్లు
కోల్డ్‌స్టోరేజీ, లింకేజీలు రూ. 132కోట్లు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ. 1000 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ.5300 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈటెల ప్రకటించారు.