వరుసకు అన్న. తోడల్లుడి కుమారుడు. అయితే ఆ యువతి అతడిని ప్రేమించింది. ఆ విషయాన్ని అతనికే చెప్పింది. తొలుత అతడు కాదన్నాడు. ఒత్తిడి చేయడంతో ఆ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఇద్దరూ అన్ని విధాలుగా దగ్గరయ్యారు. చివరకు ఇంట్లో తెలిసి మందలించారు. కానీ తను ఇష్టపడినివాడు దూరమవుతున్నాడన్న బాధతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.
అన్నను ప్రియుడుగా మార్చేసుకుంది. మొదట్లో ఇది తప్పని చెప్పాడు మహేష్. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో ఇతనే మారిపోయి ప్రేమికుడయ్యాడు. విషయం కాస్తా ఇంట్లో తెలిసిపోయింది. వైష్ణవిని మందలించారు. ఆదిలాబాద్ నగరంలోని తల్లి ఇంటికి పంపారు. దీంతో ఆ యువతి మనస్థాపానికి గురైంది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.