సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. సౌదీ వ్యక్తి అరెస్ట్

బుధవారం, 19 ఆగస్టు 2020 (13:24 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై గతంలో వార్తలు వెల్లువెత్తాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే ఎందుకున్నారంటూ విపక్ష నేతలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఆపై సద్దుమణిగినా.. మళ్లీ కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్‌ మీడియలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
దుబాయ్‌లో ఉంటున్న జగిత్యాలకు చెందిన రాజు అనే యువకుడు కేసీఆర్ కరోనాతో చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో రాజుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. 
 
సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన రాజును ముంబై ఏయిర్ పోర్ట్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు రాజును ముంబై నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ కేసులో అతన్ని పోలీసులు జ్యుడీషియల్‌ కస్టడికి పంపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు