ఉచిత నిధుల సమీకరణను పరిచయం చేసిన మిలాప్‌

సోమవారం, 17 ఆగస్టు 2020 (19:05 IST)
ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నాటి నుంచి రాబోతున్న పండుగ సీజన్‌ వరకూ 0% ప్లాట్‌ఫామ్‌ ఫీజును మిలాప్‌ పరిచయం చేసింది. ఈ సమయంలో, మిలాప్‌ యొక్క ఉచిత ప్లాట్‌ఫామ్‌ మరింత మంది ప్రజలకు చేరువ కావడంతో పాటుగా వీలైనంత త్వరగా ప్రత్యక్ష సహాయాన్ని అవసరార్థులు పొందగలరు.
 
‘‘గత కొద్ది నెలలుగా, కోవిడ్‌ -19 మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రజల నుంచి అపూర్వమైన ఔదార్యాన్ని మేము చూశాము. వేలాది మంది మిలాప్‌పై నిధులను సమీకరించడంతో పాటుగా ఆపదలో ఉన్న లక్షలాది మందికి సహాయపడ్డారు. మేము మిలాప్‌ను అన్ని సహాయసంబంధిత అంశాలకు నిధుల సేకరణకు కృతజ్ఞతా చిహ్నంగా ఉచితంగా అందిస్తున్నాం. అందువల్ల, రాబోతున్న పండుగ సీజన్‌ వేళ ఫండ్‌రైజర్లందరికీ 0% ఫీజును విస్తరించడంపై పరిపూర్ణంగా దృష్టి పెట్టాము’’ అని మయూఖ్‌ చౌదరి, కో–ఫౌండర్‌ అండ్‌ సీఈవో–మిలాప్‌ అన్నారు.
 
చౌదరి మరింతగా మాట్లాడుతూ ‘‘ మా దశాబ్దపు ప్రయాణంలో, మా కమ్యూనిటీ నమ్మకాన్ని తరువాత దశకు తీసుకువెళ్లాం. ఈ 0% ప్లాట్‌ఫామ్‌ ఫీజుతో, మా అత్యున్నత శ్రేణి కస్టమర్‌ సేవలు, నమ్మకం మరియు భద్రత, సామాజిక ఫండ్‌ రైజింగ్‌ సాంకేతికతతో పాటుగా ఎదురయ్యే ఖర్చులకు సహాయపడటానికి మేము మా దాతల నుంచి వలెంటరీ టిప్స్‌పై ఆధారపడనున్నాం’’అని అన్నారు.
 
వినియోగదారుల విజయం మరియు భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను మిలాప్‌ అందించడంతో పాటుగా ఆన్‌లైన్‌ ఫండ్‌ రైజింగ్‌ను సులభంగా, వేగంగా మరియు నమ్మకమైనదిగా మలిచింది. తమ దాతల కమ్యూనిటీకి ఏది అత్యుత్తమమో అదే అందించడానికి మిలాప్‌ కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే తమ 30 లక్షలకు పైగా కమ్యూనిటీకి అత్యుత్తమ అనుభవాలు, మద్దతును కొనసాగిస్తూనే ఫండ్‌రైజర్ల కోసం ఉత్పత్తులను అందిస్తుంది.
 
ఈ 0% మిలాప్‌ ప్లాట్‌ఫామ్‌ ఫండ్‌ రైజింగ్‌ ఫీజులు ఫండ్‌ రైజర్లందరికీ వర్తిస్తాయి. సాధారణంగా ఫండ్‌ రైజింగ్‌ కోసం 5% ప్లాట్‌ఫామ్‌ ఫీజు వసూలు చేస్తుంటారు. వ్యక్తిగత కారణాలు మరియు చారిటబుల్‌ సంస్ధలకు సైతం ఒకేలా ఈ ఫీజులు ఉంటాయి. ఇప్పటి వరకూ హైదరాబాద్‌ ఫండ్‌ రైజర్లు సంయుక్తంగా 74 కోట్ల రూపాయలను సమీకరించారు. వీటిలో దాదాపు 90% నిధులు వైద్య పరమైన కారణాల కోసం సృష్టించబడ్డాయి.
 
‘‘మా జంతు సంరక్షణ శాలను నిర్మించడం కోసం మేము మిలాప్‌పై ఫండ్‌రైజర్‌ను ఏర్పాటుచేశాం. ఒక నెలలోనే మాకు కావాల్సిన నిధులను సమీకరించగలిగాం. మిలాప్‌కు ధన్యవాదములు. దీనికారణంగానే హైదరాబాద్‌లో మొట్టమొదటి జంతు అభయారణ్యం ఏర్పాటుకానుంది. వీడియో రూపొందించడం దగ్గర నుంచి నిధులను బదిలీ చేయడం వరకూ ఈ మొత్తం ప్రక్రియ చాలా మృదువుగా సాగిపోయింది. అతి తక్కువ ప్లాట్‌ఫామ్‌ ఫీజులను వసూలు చేస్తున్న ఒకే ఒక్క ప్లాట్‌ఫామ్‌ మిలాప్‌. సామాజిక సేవ చేయాలని కోరుకునే మా లాంటి వారికి మిలాప్‌ ఓ వరం’’ అని జబీ ఖాన్‌, యానిమల్‌ యాక్టివిస్ట్‌ అన్నారు.
 
పద్మశ్రీ అవార్డు నామినీ మాత్రమే కాదు యుఎన్‌ అవార్డు గ్రహీత జబీ ఖాన్‌. ‘‘లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ అత్యంత విజయవంతమైన ప్రక్రియ.  ప్రాణాలను కాపాడే పరిష్కారంగా మరీ ముఖ్యంగా పిల్లల ప్రాణాలను కాపాడే ప్రక్రియగా ఇది నిలుస్తుంది. మిలాప్‌ లాంటి ఆన్‌లైన్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు  ఈ తరహా ప్రత్యేక శస్త్రచికిత్సలకు సహాయపడుతున్నాయి. ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇది సహాయపడటంతో పాటుగా తమ ప్రియమైన వారికి అత్యుత్తమ చికిత్సనందించేందుకు సహాయపడటానికి తోడ్పడుతుంది’’ అని డాక్టర్‌ మనీష్‌ సీ వర్మ, హెచ్‌ఓడీ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ డిపార్ట్‌మెంట్‌, అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ అన్నారు.
 
‘‘డాక్టర్లు మా అబ్బాయి నాగరాజు లివర్‌ తీవ్రంగా పాడైందని, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ మాత్రమే అతని ప్రాణాలను కాపాడగలదని తేల్చి చెప్పారు. నేను రోజువారీ కూలీ పనులు చేసుకునే వ్యక్తిని. రోజూ వచ్చే సంపాదన చాలా స్వల్పం. ఇప్పటికే పక్షవాతం బారిన పడిన మా వారి యోగక్షేమాలను చూసుకుంటున్నాను. లక్షలాది రూపాయలు శస్త్రచికిత్స కోసం తీసుకురావడం నాకు అసాధ్యం. రెయిన్‌బో హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ ప్రశాంత్‌ బచినా గారు నాకు మిలాప్‌ పైన క్రౌడ్‌ ఫండింగ్‌ ప్రచారం చేయమని సూచించారు. నేను 23 లక్షల రూపాయలను సమీకరించడంతో పాటుగా మా అబ్బాయి ప్రాణాలను కాపాడుకోగలిగాను’’ అని భూదేవి అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు