కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం రైతులకు మద్దతుగా నిర్వహించిన భారత్ బంద్ లో మంత్రి, టీఆరెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నుండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ మొండా మార్కెట్, ప్యారడైజ్, రసూల్ పురా, సింధ్ కాలనీ, రాణి గంజ్, ట్యాంక్ బండ్, లిబర్టీ, ఆబిడ్స్, కోఠి, కాచిగూడ, అంబర్ పేట, తిలక్ నగర్ నల్లకుంట,ఇందిరా పార్క్, ఐ మ్యాక్స్, ఎన్టీయార్ భవన్, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ల మీదుగా సనత్ నగర్ బస్ స్టాండ్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆరెస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కూన వెంకటేష్ గౌడ్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, కురుమ హేమలత, నామన శేషుకుమారి, అత్తిలి అరుణ, ఆకుల రూప, తరుణి తదితరులు పాల్గొన్నారు.