ప్రస్తుతం కరోనాతో చనిపోయిన హరిభూషణ్ పాటు సారక్క అలియాస్ భారతక్క కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన వారే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సీతక్క హరిభూషణ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక, సారక్కది కూడా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాల్వపల్లిలోని ఓ గిరిజన కుటుంబంలో జన్మించి ,1965లోనే మావోయిస్టు సిద్దాంతాలకు అకర్షితురాలై అడవిబాట పట్టింది.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రజలకు దూరంగా ఎక్కడో నివసించే మావోయిస్టులను సైతం కరోనా బలితీసుకోవడం గమనార్హం. ఇటీవల ఇప్పటికే పలువురు మావోయిస్టులు కరోనా భారిన పడ్డట్టు సమాచారం. ముఖ్యంగా 12 మంది అగ్రనేతలకు కరోనా సోకినట్టు ఇటివల వరంగల్ నగరంలో కరోనా చికిత్స కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు మధు చెప్పినట్టు పోలీసులు తెలిపారు.
తాజాగా రెండు రోజుల క్రితం ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు కరోనాతో చనిపోయారు. అందులో ఒకరు కేంద్ర కమిటి సభ్యుడు , కీలక నేత యాప నారాయణ అలియస్ హరిభూషణ్ తోపాటు ఇంద్రవతి ఏరియా కమిటి సభ్యురాలు భారతక్కలు మృత్యువాతపడ్డారు. కాగా వీరు కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయినట్టు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ వెల్లడించారు.