గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ...?

సోమవారం, 2 ఆగస్టు 2021 (11:49 IST)
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి తెరాసలో చేరిన యువనేత కౌశిక్ రెడ్డికి పెద్ద పదవి ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఆ ప్రకారంగానే కౌశిక్ రెడ్డికి పెద్ద పదవి వరించనుంది. ఆయన్ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా చేసేందుకు కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే గత కాలంగా తెలంగాణలో రాజకీయాలు హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. కానీ ఇదేసమయంలో కాంగ్రెస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెరాసలో చేరారు. దీంతో అక్కడ తెరాస తరపున టికెట్ ఆయనకే ఇస్తారు అనే ప్రచారం జరిగింది. 
 
తాజాగా ఈరోజు జరిగిన తెలంగాణ కేబినెట్‌లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని సూచిస్తూ గవర్నర్‌కి ప్రతిపాదనలు పంపింది. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తారా.. లేదా అన్నది వేచిచూడాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు