అవును.. ఎంపీ కవిత.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఇరికించారు. ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అంటే హైదరాబాద్‌కే పరిమితమైందని ప్రస్తుతం అన్నీ జిల్లాలకు ఐటీ విస్తరిస్తుందని కవిత చెప్పారు. ఐటీలో కొత్త ఆవిష్కరణలకు నిజామాబాద్ కేంద్రం కావాలని ఆమె ఆకాక్షించారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
అన్నయ్య కేటీఆర్ దృష్టి ఎప్పుడూ తన ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంటుందని.. జర ఆ ప్రేమను చెల్లెలు ప్రాతినిధ్యం వహించే నిజామాబాద్ పైనా చూడాలని సభాముఖంగా కోరుతున్నానని విన్నవించారు. ఇక నిజామాబాద్‌లో స్పోర్ట్స్ స్టేడియం, బస్టాండ్, ఎయిర్‌పోర్టు, మహిళల కోసం స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతోందని కవిత తెలిపారు.