హరిత ప్లాజాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో జరిగిన మీట్ ది ఎడిటర్స్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చాలా హుపారుగా గడిపారు. మీడియా ప్రతినిధులకు చానెల్ ఎడిటర్స్‌కు అందరికీ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రతి టేబుల్‌కు వచ్చి రాహుల్ చిట్ చాట్ చేసారు. ఆ తరవాత మిగిలిన టేబుళ్లన్నీ తిరుగుతూ సీనియర్ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.