నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డీజీఎం లక్షమ్మ నిధుల దుర్వినియోగం కేసులో సస్పెండ్ అయింది. ఆమె తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సీఈఓ మదన్ మోహన్‌కు వేముల వీరేశం ఫోన్ చేశాడు. ఈ విషయం తన పరిధిలోది కాదని సీఈవో సమాధానం ఇస్తుండగానే, "నా మాటకే ఎదురు చెప్తావా... ఆంధ్రా అధికారివి" అంటూ నోరు జారడంతో పాటు రాయడానికి వీల్లేని బూతులు తిట్టాడు. అడిగిన పని చేయకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా, వీరేశం వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, గతంలో ఓ కాలేజీ యజమానిని చంపుతానని హెచ్చరించి, దాని ఆడియో బయటకు రావడంతో మార్ఫింగ్ చేశారని ఎదురు ఆరోపణలు చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వేముల వీరేశం మరో వివాదంలో చిక్కాడు.