పెళ్లి వేడుక.. 50మందికి కరోనా.. ఎక్కడంటే?

గురువారం, 27 ఆగస్టు 2020 (10:33 IST)
పెళ్లి వేడుకలో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకింది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణ పరిధిలోని చెక్కీ క్యాంపులో పది రోజుల కిందట జరిగిన ఒక వివాహ వేడుక కారణంగా 50మంది కరోనా బారిన పడ్డారు. కేవలం 193 గృహాలున్న క్యాంపులో 42 ఇళ్లలోని వారికి వైరస్‌ సోకింది. 
 
అయితే వారి ఆదాయ మార్గమైన గేదెల ఆలనాపాలనా ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. మరోవైపు కోవిడ్‌ భయంతో ఇక్కడ పాలు కొనడానికి ఎవరూ రావడం లేదు. పాల కేంద్రం 20రోజులు మూసి ఉంచాలని నిర్ణయించారు.
 
మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2795 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. 
 
ఇందులో 86,095మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27,600 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 778కి చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు