కరోనా వైరస్ అసోంలో విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 94వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగొయ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. 85 ఏళ్ల గొగోయ్ బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా.. కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
అసోంలో బుధవారం ఒక్కరోజే 1973 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 94,592కి చేరింది. వీరిలో 74,814 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 260మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 19518 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత కొద్ది రోజులుగా తనను కలిసినవారు తక్షణమే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొన్ని రోజుల నుంచి స్వల్పంగా దగ్గు, జలుబు ఉన్నట్టు సమాచారం. గొగోయ్‌కి కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, అందువల్ల ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్టు పార్టీ నేతలు తెలిపారు.