కరీంనగర్ జిల్లాలోని ఓ హోటల్ ఓపెనింగ్ రోజు ఆ హోటల్ యజమాని సూపర్ ఆఫర్ అందించాడు. రూపాయి నోటుకు బిర్యానీ ఇచ్చేస్తున్నారు. ఈ ఆఫర్ గురించి తెలిసిన జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఒక్క రూపాయి నోటు ఇచ్చిన వారికి బిర్యానీ అంటూ నగరంలో ప్రచారం చేశారు. ఆ నోట్లను సేకరించి మరీ హోటల్‌కు ప్రజలు క్యూ కట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.