తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

ఆదివారం, 6 జూన్ 2021 (09:26 IST)
కేరళను ఇప్పటికే తాకిన నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కేరళ రాష్ట్రాన్ని తాకిన తర్వాత..తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆలస్యంగా రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ.. శరవేగంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి.

2021, జూన్ 05వ తేదీ శనివారం వనపర్తి, నాగర్ కర్నూలుతో పాటు..మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించాయి. జూన్ 05వ తేదీ కల్లా…తెలంగాణలో ప్రవేశించడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి.
 
11న బంగాళాఖాతంలో అల్పపీడనం..
బంగాళాఖాతంలో జూన్ 11వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని, దీని కారణంగా…జూన్ 15న ఒడిశా, ఝార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వైపు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు కదలనున్నాయని అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు