కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కష్టపడి పనిచేస్తున్న అభిమాన సేవ కార్యకర్తలకు రామ్‌చరణ్ ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ వారు తగు విధంగా స్పందించి సేవ చేయడానికి ముందుకు వచ్చిన విషయాలను, మీరు చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. అత్యవసర సమయంలో సామాన్యుడికి సేవ చేయడం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలలో మీరు అంకిత భావంతో పనిచేశారు.