జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, తన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ను కూడా రిజిస్టర్ చేయించుకున్నారు. ఇందుకోసం ఆయన గురువారం హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు.
తాను ఆర్టీవో కార్యాలయానికి వస్తున్నారని తెలిస్తే, అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు వస్తారని భావించిన పవన్ కళ్యాణ్.. ముందుగానే అధికారులను అపాయింట్మెంట్ కోరగా, గురువారం సాయంత్రం 3 గంటలకు వారు సమయం కేటాయించారు. పైగా, ఈ విషయం ఎవరికీ తెలియకుండా, రహస్యంగా ఉంచారు.
శాశ్వత నంబర్లు కేటాయించిన వాటిలో ఒక మెర్సిడెజ్ బెంజ్ కారు, రెండు మహీంద్రా స్కార్పియోలు, ఒక జీపు, ఒక టయోటా వెల్‌ఫేర్‌తో పాటు ఒక సరకు రవాణా వాహనం ఉన్నాయి. ఆ తర్వాత ఆయన అంతర్జాతీయ డ్రైవింగ్ కోసం దరఖాస్తును సమర్పించారు.