ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు బస చేయనున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్కడే ఉండనున్నారు. తెలంగాణా రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ గడ్డపై మరింతగా బలం పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ నేతలు తెలంగాణాపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.
ఇదిలావుంటే, ఈ నెల 15వ తేదీపైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనుంది. ఈ సమావేశాలకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
అలాగే, ఈ కార్యవర్గ సమావేశాలకు దేశం నలు మూలల నుంచి దాదాపు 300 నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే, ఈ సమావేశాలను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లేదా నోవాటెల్ లేదా తాజ్‌కృష్ణ నక్షత్ర హోటళ్లలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. భద్రతగా పరంగా అన్ని అంశాలను పరిగణలోని తీసుకున్న తర్వాత ఈ కార్యవర్గ సమావేశాలు జరిగే వేదికను ఖరారు చేయనున్నారు.