ఆదివాసీ తండాలకు అండ: మహబూబాబాద్‌లో పోక్సో కోర్టు

సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (14:34 IST)
గిరిజన తెగలు ఎక్కువగా ఉండే మహబూబాబాద్‌ జిల్లాతో పాటు జనగామలో పోక్సో కోర్టుల సేవలు అందుబాటులోకి రానున్నాయి. పిల్లలపై అత్యాచార కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం పోక్సో కోర్టు ఏర్పాటు చేసింది.
  
ముఖ్యంగా గిరిజన, ఆదివాసీ తండాల్లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో నిందితులు చాలా కేసుల్లో తప్పించుకుంటున్నారు. ఇలాంటి నేరాలకు చెక్‌ పెట్టి.. ఆదివాసీ తండాలకు అండగా నిలిచేందుకు న్యాయవ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 
 
ఈ నేపథ్యంలోనే చిన్నారులపై జరిగే నేరాలపై వేగంగా విచారణ జరిపేందుకు మహబూబాబాద్‌ జిల్లాలో పోక్సో కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కోర్టులో అత్యాధునిక సదుపాయాలు ఈ కోర్టులో ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌తో కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు