రూ. 350 కోట్లు పెట్టుబడితో వాటర్ ట్యాంకులు, పీవీసి పైపుల తయారీ యూనిట్‌‌కై తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం

గురువారం, 28 సెప్టెంబరు 2023 (22:42 IST)
తెలంగాణ రాష్ట్రంలో రూ. 350 కోట్ల పెట్టుబడితో తమ తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు వెల్‌స్పన్ కార్ప్ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన సింటెక్స్ బిఎపిఎల్ లిమిటెడ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయు) చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకం కింద ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయబడుతోంది మరియు నీటి ట్యాంకులు మరియు పైపులను ఇక్కడ తయారు చేయనున్నారు. ఈ యూనిట్ తెలంగాణ ప్రాంతంలో 1000 ఉద్యోగాలను సృష్టించనుంది. 
 
జాతీయ ప్రతిష్టాత్మక బ్రాండ్ అయిన సింటెక్స్, వాటర్ ట్యాంక్‌ల విభాగంలో తమ మార్కెట్ పరిధిని పెంచుకోవడంతో పాటు, వివిధ రకాల PVC పైపులు మరియు ఫిట్టింగ్‌ల సమ్మేళనంతో పాటుగా ఈ ప్రాజెక్ట్ ద్వారా పైపుల వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఇక్కడ పెట్టబోయే మొత్తం పెట్టుబడి వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాలకు విస్తరించనున్నారు.
 
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు&వాణిజ్య శాఖ, పురపాలక పరిపాలన & నగరాభివృద్ధి , IT E&C శాఖల మంత్రి శ్రీ కె. టి. రామారావుగారు, శ్రీ B K గోయెంకా, చైర్మన్, వెల్‌స్పన్ వరల్డ్ గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర నాయకులు, ప్రముఖులు మరియు సీనియర్ అధికారులు సమక్షంలో అత్యాధునిక, సాంకేతికంగా ప్రగతిశీల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.
 
నిర్మాణ సామగ్రి విభాగంలో ప్రముఖమైన, విశ్వసనీయ భాగస్వామిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి వెల్‌స్పన్ వ్యూహాత్మక అడుగు వేసింది మరియు ఈ కొత్త యూనిట్ ఆ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ సందర్భంగా గౌరవ మంత్రి శ్రీ కె.టి.రామారావు గారు మాట్లాడుతూ, “వెల్‌స్పన్ ఈ కొత్త తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తుండటం పట్ల మేము సంతోషంగా వున్నాము. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రగతిశీల విధానాలు మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు వెల్‌స్పన్ వరల్డ్‌ను రాష్ట్రంలో తమ నూతన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించాయి.  తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము మరియు రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు మద్దతునిస్తూనే ఉంటాము..." అని అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో వెల్‌స్పన్ వరల్డ్ చైర్మన్ శ్రీ బి.కె.గోయెంకా మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వంతో మా భాగస్వామ్యాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాము మరియు ఒక గ్రూప్ గా  మేము  గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో మా కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో మరింత మందికి ఉపాధిని సృష్టించనుంది. దాని వాటర్ ట్యాంకుల పరంగా సింటెక్స్ ఒక ఐకానిక్ బ్రాండ్ గా వెలుగొందుతుంది  మరియు PVC పైపుల విభాగంలోకి ప్రవేశించడం వల్ల నిర్మాణ సామగ్రి విభాగంలో మా కార్యకలాపాల మరింతగా విస్తరిస్తాయి" అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు