రామప్ప దేవాలయాన్ని యూనస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,వి. శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, శాసన మండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, కాకతీయ హెరిటేజ్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎమ్. పాండు రంగారావు, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకర్ రెడ్డి సభ్యులుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది.