కృష్ణ మాదిగ పనై పోయిందన్న వాళ్లు ఎందుకు పని చేయడం లేదు. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి గతంలో మాదిగలకు వర్గీకరణపై హామీ ఇచ్చారు. ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు పెడితే మేము మద్దతిస్తాం.
మాదిగ బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. దళిత బంధు లాంటి పథకాలు కాదు వర్గీకరణ కావాలి. దళిత బిడ్డలు, ఎమ్మార్పీఎస్ నేతలు హుజూరాబాద్‌లో పర్యటించి టీఆర్ఎస్ను నిలదీయాలి. అని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.