అజహర్ పై రేవంత్ విజయం

శనివారం, 25 సెప్టెంబరు 2021 (08:17 IST)
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ బాగారెడ్డి స్టేడియంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, అజారుద్దీన్ టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి రేవంత్ రెడ్డి టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రేవంత్  టీం విజయం సాధించింది.

ఒక బంతి మిగిలి ఉండగానే రేవంత్  టీం లక్ష్యాన్ని చేధించింది. అజహర్ టీం మొదట  బ్యాటింగ్ చేసి 130 పరుగులను చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసి 7 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని రేవంత్ టీమ్ ఛేదించింది. ఈ మ్యాచ్‌తో కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం నిండింది. 
 
జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో రాజీవ్ గాంధీ మెమోరియల్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రేవంత్ ఎలెవన్, అజారుద్దీన్ ఎలెవన్ జట్ల మధ్య పది ఓవర్ల మ్యాచ్ నిర్వహించారు.

మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. మ్యాచ్‌కు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు విచ్చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు