ఆవకాయ పచ్చడి పట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి: ఫోటోలు
బుధవారం, 27 మే 2020 (23:56 IST)
ఆమె దేశంలోనే మొదటి మహిళా హోమ్ మినిస్టర్‌గా చరిత్ర సృష్టించారు. ప్రజలకు సేవ చేయడమే.. తన లక్ష్యంగా రాజకీయాల్లో ప్రవేశించారు. ప్రజలకు ఎవరికైనా కష్టం వచ్చింది అంటే... నేనున్నాను అంటూ ముందుంటారు. ఆమె.. సబితా ఇంద్రారెడ్డి.
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నిత్యం అధికారిక కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంటారు. అయితేనేం... మంత్రి అయినా మహిళే కదే... అందుకనే ఓ సాధారణ మహిళలా ఆవకాయ పచ్చడి సిద్ధం చేసారు సబితా ఇంద్రారెడ్డి. నాడు ఆమె భర్త ఇంద్రన్న కూడా మంత్రిగా ఉంటూ పొలం పనులు చేసేవారు.
సబితా ఇంద్రారెడ్డి... పెద్ద హోదాలో ఉన్నప్పటికీ ఇలా సామాన్య గృహిణిలా ఆవకాయ పచ్చడి పెట్టిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో పలువురు సబితాను అభినందిస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆవకాయ రెడీ చేసిన మంత్రి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు.