సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల చావుతో దిశకు న్యాయం జరిగిందంటూ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సోషల్‌మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
'ఈ ఏడాదిలో ఇదే అతి పెద్ద సంఘటన. మహిళల భద్రతకు ఇది గ్యారెంటీ లాంటిది. కన్నకూతుర్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధను తీర్చలేం. కానీ, ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరింది. మహిళల్లో భయం కాస్త తగ్గింది. జై తెలంగాణ పోలీస్. క్రిమినల్స్‌కు ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ పోలీసులను చూసి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు నేర్చుకుంటారని నమ్ముతున్నా’ - భాజపా సీనియర్ నాయకురాలు ఉమాభారతి.