ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మానవ హక్కుల కమీషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు నిందితుడు భార్య, గర్భవతి అయిన మహిళ కళ్ల నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. మా ఆయన్ని చంపిండ్రుగా, అట్నే నన్ను గూడా చంపండ్రి, మా ఆయన లేనిదే నేను బతకలేను అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.