తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. వెన్నునొప్పితో..?

ఆదివారం, 1 నవంబరు 2020 (13:52 IST)
తుపాకీతో కాల్చుకొని ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం వెన్నునొప్పి. ఆదివారం సికింద్రాబాద్‌ డివిజన్‌లోని రాణిగంజ్‌ ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం బత్తులపాలెం గ్రామానికి చెందిన మధు (32) 2009లో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. నాటినుంచి తిరుపతిలో పనిచేసి రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు. 
 
ఆదివారం మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాణిగంజ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తూ తన ఎస్‌ఎల్‌ఆర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కొంతకాలంగా మధు తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నాడని తెలుస్తోంది. అనారోగ్యం తీవ్రంగా బాధిస్తున్న కారణంగానే మధు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు