ఐసీఎస్‌ఈ పరీక్షలలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

సోమవారం, 18 జులై 2022 (20:23 IST)
కరోనా మహమ్మారి విజృంభణ, ఆన్‌లైన్‌ తరగతులు వీటికి తోడు పరీక్షల విధానంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించినప్పటికీ, తెలంగాణా రాష్ట్ర విద్యార్థులు ఐసీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలలో తమ సత్తా చాటారు. ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌, హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు ఆల్‌ ఇండియా మెరిట్‌ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌కు చెందిన రియా సుసన్‌ టొనీ 99.4% మార్కులు సాధించగా, అదే స్కూల్‌కు చెందిన కటారు రోహిత రెడ్డి సెకండ్‌ టాపర్‌గా 98.2% మార్కులు సాధించింది.

 
తన విజయానికి ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌లోని టీచర్లు కూడా ఓ కారణమని రోహిత రెడ్డి చెబుతూ, వారు ఎప్పుడూ తమకు అందుబాటులో ఉండేవారన్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఈ విజయానికి కారణంగా అభివర్ణించింది. రోహిత మాట్లాడుతూ... మహమ్మారి కారణంగా డెహ్రాడూన్‌లోని వెల్హామ్స్‌ గాళ్స్‌ స్కూల్‌ వదిలి తాను ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌లో చేరానని చెప్పింది.

 
కరోనా మహమ్మారి ఓ సవాల్‌ విసిరితే, ఆన్‌లైన్‌ విధానం స్వీకరించడం మరో సవాల్‌గా నిలిచింది. దీనికితోడు పరీక్షల విధానంలో మార్పులు కూడా విద్యార్థులకు ఓ పెద్ద పరీక్షగా నిలిచాయి. అయితే నమూనా పరీక్షలను ఎక్కువగా రాయడంతో పాటుగా స్కూల్‌ నిర్వహించిన ప్రీ-బోర్డ్‌ పరీక్షలకు హాజరుకావడం, సందేహాలను నివృత్తి చేయడానికి ఆన్‌లైన్‌లో టీచర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం తమకు సహాయపడ్డాయని వెల్లడించింది. ఐఐటీ పరీక్షలలో తన సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్న రోహిత కంప్యూటర్‌ ఇంజినీర్‌ కావాలని, పరిశోధనా రంగంలో స్థిర పడాలని కోరుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు