ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన చౌహాన్ లక్ష్మణ్ కుమార్తె అఖిల (17) అనే యువతి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు నేరడిగొండ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మహేందర్‌తో పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకుని సరాదాగా షికార్లకు వెళ్లేవారు. ఇలా ఓ యేడాది గడిచిపోయింది.
దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు తెల్లవారుజామున అఖిలను చున్నీని మెడకు బిగించి చంపేశారు. వేరే కులానికి చెందిన యువకుడితో చనువుగా తిరగటం నచ్చక కూతురిని చంపేశామంటూ శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు లొంగిపోయారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ సంఘటన స్థలిని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.