తెలంగాణలో కిడ్నీ రోగుల కోసం 61 డయాలసిస్ కేంద్రాలు

శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:36 IST)
తెలంగాణ సర్కారు కిడ్నీ రోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  రాష్ట్రంలో కొత్తగా 61 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
కిడ్నీ వ్యాధి గ్రస్థులకు డయాలసిస్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో కొత్తగా 515 డయాలసిస్ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.
 
ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రుల్లో మాత్రమే ఉన్న డయాలసిస్ సేవలు ఇక నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. 
 
ఇందులో భాగంగా మొదట ఐదు ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు