తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2010లో శ్రీవారికి మొక్కుకున్న కేసీఆర్ తన మొక్కు తీర్చుకోబోతున్నారు. రూ.5.59 కోట్లతో శ్రీవారికి సాలగ్రామహారం, పేటల కంఠాభరణం ఇవ్వబోతున్నారు. ఈ నగల్ని కోయంబత్తూరులో 19 కిలోల బంగారంతో చేయించారు. ఆభరణాల తయారీ బాధ్యతను టీటీడీకి తెలంగాణ సర్కారు అప్పగించింది. కీర్తిలాల్‌కాళిదాస్ కంపెనీ ఈ టెండర్లు దక్కించుకుని ఆభరణాలు తయారు చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉమ్మడి రాష్ట్రంలోని తిరుపతి, కనకదుర్గమ్మ దేవాలయంతో పాటు ఇతర దేవుళ్లు దేవతలకు ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటానని కేసీఆర్ అప్పట్లో తెలిపారు. ఇప్పటికే తెలంగాణలోని దేవుళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.