నేడు రాజ్‌భవన్‌కు కాంగ్రెస్‌ బృందం: డ్రగ్స్‌, ఎలుకల దాడిపై..?

బుధవారం, 13 ఏప్రియల్ 2022 (11:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలపై గవర్నర్‌ని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. రాజభవన్‌లో గవర్నర్ తమిళ సైతో సమావేశం కానున్నారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ వద్ద సమావేశమై గవర్నర్ కార్యాలయానికి బయలుదేరుతారు.
 
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో 28 మంది సభ్యుల బృందం గవర్నర్‌తో భేటీ అవుతారు. రాష్ట్రంలో మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని కోరనుంది కాంగ్రెస్‌ పార్టీ.
 
ఇక, హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్మకం పెరిగిపోవడంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరనుంది. హైదరాబాద్ పబ్బుల్లో ఇటీవల దాడి జరిగితే కొందరిని వదిలేసి డ్రగ్స్ కేసు తప్పు దోవ పట్టిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. 
 
వరంగల్ ఆసుపత్రిలో ఎలుకల దాడి వంటి అంశాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరనుంది. గ్రేటర్ హైదరాబాద్‌పై గవర్నర్‌కి ఉన్న అధికారాలు ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ సూచనలు చేయాలని భావిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు