మాస్క్ పెట్టుకోలేదని జడ్పీ ఛైర్మన్‌కు అపరాధం

శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (19:46 IST)
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల స్వచ్ఛంధంగా గ్రామాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు కూడా కరోనా రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్‌లు పెట్టుకోని వారికి ఫైన్‌లు వేస్తున్నారు. వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి మాస్క్ పెట్టుకోకపోవడంతో రూ.1000 జరిమానా విధించారు. 
 
కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రమాదకరమైందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి మాస్క్ ధరించాలని కోరారు. ఇక నుంచి ఫంక్షన్‌‌లకు దూరంగా ఉండి.. కోవిడ్ రూల్స్‌ను పాటించాలన్నారు. 
 
ప్రజలు గుంపులు గుంపులుగా ఉండొద్దన్నారు. షాప్ యాజమాన్యాలు కూడా మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతించాలన్నారు. ప్రతి ఒకరు సామాజిక దూరం పాటించాలన్నారు. 45 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు