నేరెడ్‌మెట్ లోని కాకతీయనగర్‌లో గురువారం సాయంత్రం తప్పిపోయిన 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతంగా మారింది. నిన్న రాత్రి సైకిల్ పైన బయటకు వెళ్లిన సుమేద ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో కలిసి నిన్నరాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టారు.
బాలిక సైకిల్‌ను నాలా సమీపంలో పోలీసులు గమనించి బాలికను కనిపెట్టే ప్రయత్నం చేశారు. జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం అధికారులను అప్రమత్తం చేశారు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత అధికారులు బాలిక మృతదేహాన్ని వెలుపలికి తీసారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.