పెళ్ళి చేసుకునేందుకు స్వదేశానికి వచ్చి కరోనాతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. 40 రోజుల వైద్యానికి 50 లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు నిలబడలేదని కన్నవారి ఆవేదన. అత్తారింటికి పంపాల్సిన కూతుర్ని కాటికి పంపాల్సి వచ్చిందని కన్నీళ్ళు. పెళ్ళి చేసుకుని కళ్ళ ముందు కళకళలాడుతూ తిరగాల్సిన కూతురు కాటికి చేరడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
చికిత్స కోసం 50 లక్షలకు పైగా ఖర్చు చేశామనీ, అయినా ప్రాణం దక్కలేదని నరిష్మా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నాయి. ఒక్క క్షణం అప్రమత్తంగా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది.