నల్లగొండలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన యువకులైన విద్యార్థులు గల్లంతయ్యారు. సరదా కోసం వచ్చి సాగర్‌లోకి దిగారు అంతే గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తూ నీటిలో జారిపోయి వుంటారని తెలుస్తోంది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు నల్లగొండకు చెందిన నాగరాజు, వాచస్పతి, చంద్రకాంత్‌లుగా గుర్తించారు. పుష్కర్ ఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు సాగర్ లోకి దిగగా వీరు గల్లంతు అయ్యారని తెలుస్తోంది.