తెలంగాణ రాష్ట్రంలో గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేశారు. ఈ పరీక్షల తేదీలను రీ-షెడ్యూల్ చేశారు. ఈ పరీక్షలను నవంబరు 2, 3 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షల తేదీలకు వారం రోజుల ముందు ఆన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేశారు.
ఈ పరిస్థితుల్లో నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి ఆదేశాలు ఇచ్చారు. టీఎస్ పీఎస్సీతో చర్చించి గ్రూపు-2 పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో టీఎస్ పీఎస్సీ వర్గాలతో శాంతికుమారి చర్చలు జరిపారు. అనంతరం గ్రూపు-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గ్రూపు-2 పరీక్షలు ఆగస్టు 23, 30 తేదీల్లో నిర్ణయించాల్సివుంది.
బోనులో చిరుతను బంధించిన తితిదే అధికారులు
తిరుమల నడక మార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కింది. చిరుత పట్టుకునేందుకు సిబ్బంది ఘటనా స్థలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బోన్లు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఫలితంగా తిరుమల - అలిపిరి కాలినడక మార్గంలో ఏదో మైలు రాయి వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కింది.
కాగా, ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం కాలి నడక మార్గంలో తిరుమలకు వెళుతుండగా అకస్మాత్తుగా చిరుత బాలిక దాడి చేసింది. తల్లిదండ్రుల కంటే ముందు వెళుతున్న బాలికపై రాత్రివేళ దాడి చేసిన చిరుత ఆ తర్వాత పొదల్లోకి చిన్నారిని ఈడ్చుకెళ్లి చంపి తినేసింది.