నిజానికి వైరస్ పూర్తిగా పోలేదని, కేవలం కేసుల సంఖ్య మాత్రమే తగ్గిందన్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం మానేశారన్నారు. భౌతిక దూరం పాటించడం లేదన్నారు.
మార్కెట్లు, హోటళ్లు, మాల్స్ జనంతో రద్దీగా మారుతున్నాయని చెప్పారు. దీంతో కేసుల పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే థర్డ్‌వేవ్ ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు.