కాగా, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దళితుల కోసం ప్రత్యేక బీమా సౌకార్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ మేరకు దళిత సంక్షేమ శాఖ కసరత్తులు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చెప్పినట్లు వెల్లడించారు.
'రైతు సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేయడానికి ఏడాది పట్టింది. 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి… అందులో రైతుల వివరాలు సేకరించి జాగ్రత్తగా దాన్ని అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం చేనేత కార్మికుల బీమా సదుపాయం కోసం అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. దళిత సంక్షేమ శాఖ కూడా ఆ ఏర్పాట్లలో ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో చెప్పాం' అని కేసీఆర్ తెలిపారు.