బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో సీనియర్ నేతలు.... జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్ధానాలు మరిచి అబద్ధాలు, మోసం చేసేవారిని కూడా చెప్పుతో కొట్టాలన్నారు. అవినీతి కంటే ఇచ్చిన మాట తప్పడమే పెద్ద మోసమన్నారు. టీఆర్ఎస్.. దళిత సీఎం హామీ ఏమైందని వీహెచ్ ప్రశ్నించారు.
రెండు పడకగదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేసిన వారిని కూడా అదే విధంగా శిక్షించాలన్నారు.మరోవైపు ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం మాటలతో సరిపెడుతోందని, చేతల్లో చూపించాల్సి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.