మహబూబ్ నగర్ జిల్లాలో మట్టి ఇల్లు కూలి తల్లి, ఇద్దరు పిల్లలు మరణం

బుధవారం, 19 ఆగస్టు 2020 (16:08 IST)
మహబూబ్ నగగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఇంటి వద్ద మట్టి ఇల్లు కూలిన ఘటనలో తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందారు. జిల్లాలోని గంగేడు మండలంలోని పగిడ్యాల గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన జొన్నల శరణమ్మ(35), పెద్ద కుమార్తె భవానీ(13), చిన్న కుమార్తె వైశాలి(9)తో కలిసి ఇంట్లో నివసిస్తోంది.
 
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వారి మట్టి ఇల్లు పూర్తిగా నాని పోయింది. ఈ తెల్లవారు జామున వారు నిద్రిస్తున్నసమయంలో ఒక్కసారిగా కూలి వారిపై పడింది. ప్రమాదంలో తల్లి, కుమార్తెలు ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు