కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా ముప్పు తప్పలేదు. ఈ కేసులు ఎక్కువగా వరంగల్‌లో ఇటీవల వెలుగుచూస్తున్నాయి. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు రెండు విడతలు టీకా తీసుకున్నా మళ్లీ కరోనా బారిన పడ్డారు. కీర్తినగర్ యూపీ హెచ్‌సీల్‌లో నాలుగు రోజుల కిందట 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.