వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వపరంగా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ తెలిపారు. భారీ వర్షాల వల్ల వరద నీటిలో మునిగి దెబ్బతిన్న పంటలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
శనివారం పీచర, ధర్మారం, చింతల్ చాంద గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, పంటలను, చేపల చెరువును పరిశీలించారు. ఏ మేరకు పంట నష్టం వాటిల్లిందని రైతులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వరదల తాకిడి వల్ల పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని, వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుందని అన్నారు. వర్షాలు అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.