ఇవాళ బీఆర్కే భవన్ లో తనను కలిసిన జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్టు లెక్చర్ల జేఎసీ నేతలకు బేసిక్ పే అమలు కు సంబంధించిన 104, 105, 106 జీవోలను మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలను మంత్రులు అభినందించారు.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ ఛైర్మన్ కనక చంద్రం , సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్ మరియు రాష్ట్ర మహిళా సెక్రెటరీ మాలతి, డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల అధ్యక్షులు వినోద్ కుమార్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యక్షులు ఉమ శంకర్ , రాష్ట్ర నాయకులు సదానందం మరియు త్రి భువనేశ్వర్ లో తదితరులు పాల్గొన్నారు