సీఎం కేసీఆర్ కనిపించకపోతే రాష్ట్రంలో పాలన ఆగినట్టా?

గురువారం, 9 జులై 2020 (18:18 IST)
గత కొద్ది రోజులుగా తెలంగాణా సీఎం ప్రజల, మీడియాల ముందు రాకపోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ సీఎం కనిపించక పోవడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. 
 
ఈ సందర్భంగా ఆయన గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణాపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు.
 
ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదనటం సరైంది కాదని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రులల్లో మెరుగైన సదుపాయాలున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు