తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నల్గొండకు రూ.18 వేల కోట్ల ప్యాకేజీని ఇస్తే మునుగోడు ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటామని ప్రకటించారు.
ఇదే అంశంపై కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రధాని మోడీ ప్రభుత్వంపై వరుస ట్వీట్లు చేశారు. ఫ్లోరోసిస్ నిర్మూలనకు మిషన్ భగీరథకు రూ.19,000 కోట్లు కేటాయించాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్రం పట్టించుకోవడం కేటీఆర్ ఆరోపించారు.