బైకుపై ఎక్కించుకుని మహిళపై ఇద్దరి సామూహిక అత్యాచారం

శనివారం, 3 జూన్ 2023 (09:24 IST)
బస్సు కోసం వేచి వున్న మహిళను బైకుపై తీసుకెళ్లిన ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జుక్కల్ వెళ్లేందుకు ఖండే బల్లూరులో బస్సుకోసం మహిళ నిరీక్షిస్తోంది. 
 
మహిళకు చెందిన యువకుడు బైకుపై గ్రామానికి వెళ్తున్నాడు. ఈ బైకుపై మరో యువకుడు కూడా వున్నాడు. బైకుపై గ్రామానికి తీసుకెళ్తామని మహిళను నమ్మించాడు. ఆ యువకుడు తన గ్రామానికి చెందిన వాడే కావడంతో నమ్మి బైకు ఎక్కింది. 
 
గ్రామానికి వెళ్లే మార్గంలో నిర్మానుష్య ప్రాంతంలో మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయమై  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు