విలీనం వార్తలను ఖండించిన వైఎస్ షర్మిల.. నా ఆరాటం.. నా పోరాటం..

శనివారం, 24 జూన్ 2023 (09:52 IST)
వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారన్న కథనాలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల సీరియస్‌గా స్పందించారు. కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారనే వార్తలు తెగ ప్రచారమవుతున్నాయి. 
 
దీనిపై షర్మిల స్పందిస్తూ.. ఊహాజనిత కథలు కల్పిస్తూ.. తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. విలీనం వార్తలను ఖండించారు. తన భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనేనని.. తన ఆరాటం, తన పోరాటం తెలంగాణ కోసమేనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తన రాజకీయ భవితపై పెట్టే సమయాన్నికేసీఆర్ పాలనపై పెట్టాలని సూచించారు. 
 
మరోవైపు షర్మిల ఉన్నట్టుండి ఈ ప్రకటన చేయడం వెనుక తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు కూడా ఓ కారణమని తెలుస్తోంది. వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ హైకమాండ్ టచ్‌లో ఉందని థాక్రే అన్నారు. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో లాభం ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఎంతగానో కష్టపడుతున్నారని అన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు